Khammam: ఖమ్మంలో వైభవంగా 'బాలోత్సవ్' సంబరాలు ప్రారంభం!

Khammam: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో వారధి ఫౌండేషన్, డ్యాన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే పిల్లల పండుగ బాలోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 11 Nov 2026 5:22 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో వైభవంగా 'బాలోత్సవ్' సంబరాలు ప్రారంభం!

ఖమ్మం: ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో పిల్లల పండుగ బాలోత్సవ్ వేడుక ప్రారంభం అయింది. రెండో రోజుల పాటు వారధి ఫౌండేషన్ వారి సహకారంతో ఖమ్మం డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బాలోత్సవ్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. బాలోత్సవ్ వేడుకకు ముఖ్య అతిథులుగా అడిషనల్ సిపి రామాంజనేయులు ప్రముఖ డాక్టర్లు కూరపాటి ప్రదీప్, జంగాల సునీల్ కుమార్ లు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఖమ్మం డ్యాన్స్ అసోసియేషన్ కమిటీ వారు తెలుగు రెండు రాష్ట్రాల స్థాయి బాలోత్సవ్ వేడుకను ఏర్పాటు చేయడం పట్ల అతిధులు ప్రశంసించారు.

పిల్లలలో ఉన్న టాలెంట్ ను వెలికి తీసేందుకు బాలోత్సవ్ వేడుక ఎంతో ఉపయోగపడుతుందని దాదాపు 300 మందికి పైగా పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరచటం పట్ల ఆనందంగా ఉందని ఇంతటి కార్యక్రమంకు సహకరించిన పెద్దలకు మిత్రులకు వారధి ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ చింతనిప్పు కృష్ణ చైతన్య ధన్యవాదాలు తెలియజేసారు. వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలలో ఉన్న భయాన్ని పోగొట్టేలా మానసిక ఉల్లాసాన్ని మనోధైర్యం ను కల్పించేలా మరిన్ని. కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.