Khammam: 150 మంది తలసేమియా బాధితులకు చేయూత మంత్రి పొంగులేటి చొరవ
Khammam: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఖమ్మం జిల్లాలో 150 మంది తలసేమియా బాధితులకు చేయూత పింఛన్లు. క్యాంపు కార్యాలయానికి వచ్చి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు.
Khammam: 150 మంది తలసేమియా బాధితులకు చేయూత మంత్రి పొంగులేటి చొరవ
ఖమ్మం: ఆ చిన్నారుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న చొరవకు తలసేమియా బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం వ్యాధితో పోరాడుతూ.. చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు చేయూత పింఛన్లు మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని గుర్తించి అండగా నిలిచిన శీనన్నకు ధన్యవాదాలు తెలిపారు.
తలసేమియా బాధితుల సమస్యలపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్లమెంటులో గళమెత్తారని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా జిల్లాలోని బాధితులకు చేయూత పథకం ద్వారా పింఛన్లు అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని వారు గుర్తుచేసుకున్నారు. ఆయన కృషితో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ పరిధిలోని సుమారు 150 మంది చిన్నారూలతో పాటు వివిధ ప్రాంతాల్లోని వందలాది మంది బాధితులకు పింఛన్లు మంజూరు కానుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షురాలు పొద్దుటూరి పావని ఆధ్వర్యంలో 20 మందికి పైగా తలసేమియా బాధితులు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డిని కలిసి మంత్రి శీనన్నకు తమ కృతజ్ఞతలు తెలియజేయాలని కోరారు. తమ బాధను అర్థం చేసుకుని ఆర్థికంగా అండగా నిలుస్తున్న మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అనిత, ఉదయభాస్కర్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన తలసేమియా బాధితులు పాల్గొన్నారు.




