Khammam: నేడు పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ‘పిల్లల ప్రజావాణి’
Khammam: పిల్లల సమస్యల పరిష్కారానికి సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ‘పిల్లల ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ తెలిపారు.
Khammam: నేడు పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ‘పిల్లల ప్రజావాణి’
ఖమ్మం: నేడు (సోమవారం) పిల్లలు, ముఖ్యంగా బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వారి హక్కులకు సంబంధించిన అంశాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేందుకు పిల్లల ప్రజావాణి కార్యక్రమం ఒక ప్రత్యేక వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పిల్లల ప్రత్యేక ప్రజావాణి సందర్భంగా పిల్లల భద్రత, రక్షణ, విద్య, ఆరోగ్యం, పోషణ, అభివృద్ధి, బాలల హక్కులకు సంబంధించిన సమస్యలు స్వీకరించి, సంబంధిత శాఖలకు పంపి సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
పిల్లల ప్రజావాణి కార్యక్రమం కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయబడుతుందని, కార్యక్రమంలో పిల్లలకు సురక్షితమైన, స్నేహపూర్వకమైన వాతావరణం కల్పిస్తూ, వారి గౌరవం, గోప్యత కు పూర్తి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు .
సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఫిర్యాదులు, సమస్యలను నేడు కలెక్టరేట్, ఖమ్మంలో నిర్వహించే పిల్లల ప్రజావాణి ప్రత్యేక డెస్క్‌లో తెలియజేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




