Khammam: ఖమ్మంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ

Khammam: ఖమ్మం నగరంలో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 26 Jun 2026 1:43 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ

Khammam: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని వివిసి టాటా సర్వీస్ సెంటర్ నుంచి లాకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... దేశ నిర్మాణంలో యువత పాత్ర చాల కీలకమని, యువతకు ఉపాధి కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే అప్రమత్తం కావాలని అన్నారు.

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూమాధకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్‌ అందించాలని అన్నారు. యువత దృష్టి అంతా జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్ధాలకు విద్యార్ధులు ఆకర్షితులు కావద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.మాదకద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీసుశాఖ కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తునమన్నారు.

ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1908 కు సమాచారం అందించాలన్నారు. మీ వివరాలు గోప్యం గా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, యువత, అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్ములనకై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాధకద్రవ్యల నిర్ములన కై "ఐయమ్ యాంటీ డ్రగ్ సోల్జర్స్" సెల్ఫ్ పాయింట్ వద్ద ఫోటో, సైన్ బోర్డు వద్ద సంతకం చేశారు.

కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, ఎస్బి ఏసీపీ మహేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఎస్సై లు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story