Khammam: ఖమ్మం ఇసుక సరఫరా ఆన్‌లైన్‌లోనే బుక్ చేయాలి కలెక్టర్

Khammam: ఖమ్మంలో ఇసుక సరఫరాపై కలెక్టర్ దివాకర సమీక్ష. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆన్‌లైన్ ద్వారానే ఇసుక బుకింగ్ చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 15 July 2026 6:43 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం ఇసుక సరఫరా ఆన్‌లైన్‌లోనే బుక్ చేయాలి కలెక్టర్

ఖమ్మం: జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక సరఫరా ఆన్లైన్ లోనే బుకింగ్ జరగాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక సరఫరాపై వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇసుక సరఫరా ఆన్లైన్ లో పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు. జిల్లాలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులకు ఇప్పటివరకు ఎంత పరిమాణం ఇసుక, ఎక్కడెక్కడి నుండి పొందింది నివేదిక స్స్నర్పించాలన్నారు. ఇసుకను టీజీఎండీసీ, స్యాండ్ బజార్, స్థానికంగా సమకూర్చుకోవాలని, ఇదీ బుకింగ్ ఆన్లైన్ లోనే చేయాలని అన్నారు.

జిల్లాలోని అన్ని స్యాండ్ బజార్ లలో 1000 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక రీచ్ ల వారీగా వచ్చిన ఆదాయం వివరాలు వెంటనే సమర్పించాలని, ఇట్టి ఆదాయాన్ని నిబంధనల మేరకు ఆయా గ్రామ పంచాయతీ తదితరాలకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇంజనీరింగ్ శాఖలు తమ తమ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల విషయమై సమస్యలు ఉంటే వెంటనే నివేదిక అందించాలని, అట్టి సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖలచే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎలాంటి అలసత్వం లేకుండా, నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనుల పూర్తికి కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, పీవో టిజిఎండిసి జి. శంకర్, మైన్స్ ఏజి ఏ. రమేష్, విద్యా శాఖ ఇఇ బుగ్గయ్య, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, పీఆర్ ఇఇ లు మహేష్ బాబు, రామకోటి, డిఇ లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శర్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story