Khammam: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్, హోంగార్డ్ అధికారుల సన్మానం
Khammam: ఖమ్మంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు, హోంగార్డులను సీపీ సునీల్ దత్ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
Khammam: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్, హోంగార్డ్ అధికారుల సన్మానం
ఖమ్మం: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్, హోంగార్డ్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు,శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలందించారారని పోలీస్ కమీషనర్ కొనియాడారు.
విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ విరమణ పొందిన వారు..
SK. సర్దార్, ఎస్సై త్రీ ఖమ్మం.
D. హైమావతి, సీపర్ (పోలీస్ హెడ్ క్వాటర్స్ )
G. సైదులు (హోంగార్డ్ )
కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్,ఆర్ ఐ లు కామరాజు, సురేష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హేమనాధ్, హోంగార్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను,జాతీయ ఉపాధ్యక్షులు CC 21 E. వెంకటేశ్వర్లు, సంక్షేమ సంఘం సీనియర్ అడ్వైజర్ D. రమేష్, V. అప్పారావు, కె.వి.ఆర్ కే రెడ్డి తదితర హోంగార్డ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.




