Khammam: ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్

Khammam: వార్షిక తనిఖీలలో భాగంగా ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని సీపీ సునీల్ దత్ సందర్శించి రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 14 Nov 2026 7:03 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్

ఖమ్మం: ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ వార్షిక తనిఖీలలో భాగంగా ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, పెండింగ్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సిఐలు ముష్కరాజు, మురళి, సాగర్, సంజీవ్, డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.