Khammam: పర్యావరణ సమతుల్యతకు అందరూ భాగస్వామ్యం కావాలి ఖమ్మం సీపీ

Khammam: ఖమ్మం అంబేద్కర్ మహిళా కాలేజీలో వనమహోత్సవం. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్. సంరక్షణ అందరి బాధ్యత.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 July 2026 3:15 PM IST
Khammam
X

Khammam: పర్యావరణ సమతుల్యతకు అందరూ భాగస్వామ్యం కావాలి ఖమ్మం సీపీ

ఖమ్మం: పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అందరూ భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా నగరంలోని

డా,, బిఆర్. అంబేద్కర్ మహిళ జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణ, చెట్ల ఆవశ్యకతపై ప్రజలలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, రోడ్లకిరువైపులా సామూహికంగా మొక్కలు నాటే డ్రైవ్‌లు చేపడతామన్నారు.

కార్యక్రమంలో ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, కాలేజ్ ప్రిన్సిపాల్ యం. రాజలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డా,,బి. కనకవల్లి, ఇన్స్పెక్టర్ కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్ పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story