Khammam: గణేష్ నిమజ్జనం: ఖమ్మంలో పోలీసుల శోభాయాత్ర, అన్నదానం

Khammam: ఖమ్మం పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో నిర్వహించిన గణేష్ నవరాత్రి ముగింపు వేడుకలు, అన్నదానంలో సీపీ సునీల్ దత్ పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 26 Sept 2026 9:39 PM IST
Khammam
X

Khammam: గణేష్ నిమజ్జనం: ఖమ్మంలో పోలీసుల శోభాయాత్ర, అన్నదానం

Khammam: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో పోలీస్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కుటుంబాలు ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని పోలీస్ కమిషనర్‌తో పాటు పోలీస్ అధికారులు సందర్శించి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొని, పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. పోలీస్ కుటుంబాలతో కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా సిబ్బందిలో ఆత్మీయత, కుటుంబ భావన మరింత బలపడుతుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

గణేష్ విగ్రహ ఊరేగింపులో పాల్గొన్న పోలీస్ సిబ్బంది.

పది రోజులుగా గణేష్ నవరాత్రుల బందోబస్త్ విధులలో వున్న పోలీస్ సిబ్బంది ఈ రోజు గణేష్ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేష్ విగ్రహ శోభాయాత్రలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్రలో పోలీస్ సిబ్బంది పాల్గొని, ఉత్సవాల నిర్వహణలో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ ఎస్పీ రామానుజం, అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి,విజయబాబు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఎస్బీ ఏసీపీ మహేష్, సర్వర్,శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్ ఐ లు కామరాజు, సురేష్, అప్పలనాయుడు, సాంబశివరావు, సిఐ లు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.