Khammam: ఖమ్మంలో రామారావు హత్య కేసులో నిందితుల అరెస్ట్: సీపీ సునీల్ దత్!
Khammam: ఖమ్మం జిల్లా సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రెండు కత్తులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సునీల్ దత్ వెల్లడించారు.
Khammam: ఖమ్మంలో రామారావు హత్య కేసులో నిందితుల అరెస్ట్: సీపీ సునీల్ దత్!
ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్ మెంటల్ శ్రీను, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కర్లపూడి ఉదయ్ కుమార్ అలియాస్ రుక్మాన్ కుమార్ అనే వ్యక్తులు సామినేని రామారావును హత్య చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ కాన్ఫీరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన ఆయా నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. సాంకేతిక ఆధారాలు, పలు కోణాల్లో దర్యాప్తు అనంతరం ఈ నలగురుని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు.
వీరిలో ముగ్గురు గతంలో తెల్దరుపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులుగా ఉన్నారని, నేరస్థులు రాజకీయ, ఆర్థిక విభేదాలే రామారావు హత్యకు కారణంగా ప్రాథమికంగా తేలిందని, తదుపరి దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు. నిరుడు అక్టోబర్ 31వ తేదీన చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సామినేని రామారావును నిందితులు అత్యంత దారుణంగా కత్తులతో హత్య చేశారు.
ఈ హత్యోదంతంపై రాజకీయ ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఏడాదిపాటు పరిశోధన సాగిన ఈ కేసును ఛేదిస్తూ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి హత్యకు వాడిన రెండు కత్తులను ,4 మొబైల్ ఫోన్ స్వాదినం చేసుకున్నారు.




