Sathupalli: సత్తుపల్లి ప్రభుత్వ కళాశాలలో డీఐఈవో ఆకస్మిక తనిఖీ
Sathupalli: సత్తుపల్లి శ్రీ బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఖమ్మం జిల్లా ఇంటర్ విద్యాధికారి కె. రవిబాబు ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతులు, భవనాలను పరిశీలించారు.
Sathupalli: సత్తుపల్లి ప్రభుత్వ కళాశాలలో డీఐఈవో ఆకస్మిక తనిఖీ
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు సత్తుపల్లిలోని శ్రీ బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, ప్రాయోగిక విద్య, విద్యార్థుల అభ్యసన కార్యకలాపాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
తనిఖీలో భాగంగా విద్యార్థులతో మమేకమైన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సైన్స్ విద్యార్థులతో మాట్లాడి ప్రాయోగిక పరీక్షల నిర్వహణ, వాటి ప్రాధాన్యత గురించి ఆరా తీశారు. ఆర్ట్స్ విద్యార్థులతో మాట్లాడుతూ వారికి నిర్వహిస్తున్న వివిధ అభ్యసన కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులతో మాట్లాడి ఉద్యోగ శిక్షణలో భాగంగా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగ శిక్షణ కార్యక్రమం (ఓజేటీ) వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కళాశాలలో 1970లో నిర్మించిన పాత భవనాలను పరిశీలించారు. ఆ భవనాల్లోని గదులను తనిఖీ చేసి, వాటి ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు. పాత భవనాలకు సంబంధించిన అంశాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గుడిపాటి లక్ష్మయ్యతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.




