Khammam: జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికైన ఎస్ఐ స్వప్నకు సన్మానం

Khammam: రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్‌లో 4 పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన ఖమ్మం ఎస్ఐ గంజి స్వప్నను డీఐజీ ఎన్. శ్వేత, సీపీ సునీల్ దత్ అభినందించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 28 Nov 2026 5:39 PM IST
Khammam
X

Khammam: జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికైన ఎస్ఐ స్వప్నకు సన్మానం

ఖమ్మం: 3వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్ఐ గంజి స్వప్న అద్భుత ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికైన సందర్భంగా ఎస్ఐ ను వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇంచార్జ్ డీఐజీ ఎన్. శ్వేత, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

మెడికో లీగల్ ఓరల్ టెస్ట్‌లో ఒక సిల్వర్ మెడల్. ఫోరెన్సిక్ సైన్స్‌లో ఒక సిల్వర్ మెడల్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫోటోగ్రఫీలో ఒక బ్రాంజ్ మెడల్. లా విభాగంలో ఒక బ్రాంజ్ మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన ఎస్ఐ గంజి స్వప్న ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ముంబైలో నిర్వహించనున్న 70వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయిలో నాలుగు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఖమ్మం పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ ఇదే ప్రతిభను కొనసాగించి మరిన్ని పతకాలు సాధించి ఖమ్మం పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ నర్సింహారావు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.