Khammam: ఖమ్మంలో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం

Khammam: ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం ఘనంగా జరిగింది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి. రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 25 Sept 2026 6:28 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం

Khammam: ఖమ్మం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో (Meeting Hall) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 3:00 గంటలకు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని (World Pharmacists Day) ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ డి. రామారావు మరియు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ (Dy. DM&HO) డాక్టర్ వేణు మాధవ రావు హాజరై, జిల్లా వ్యాప్తంగా సేవలందిస్తున్న ఫార్మసిస్టులందరికీ ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... ప్రజలకు నాణ్యమైన ఔషధాలను అందించడంలో, మందుల సరైన వినియోగంపై రోగులకు అవగాహన కల్పించడంలో మరియు మందుల భద్రతా ప్రమాణాలను (Medication Safety) పాటించడంలో ఫార్మసిస్టులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మొత్తం ఆరోగ్య రక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టుల సేవలు ఎంతో విలువైనవని పేర్కొంటూ, ప్రజారోగ్య పరిరక్షణలో వారు మరింత అంకితభావం, బాధ్యతాయుతమైన దృక్పథంతో పనిచేయాలని సూచించారు.

ఈ వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రభుత్వ ఫార్మసిస్టులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.