Sathupally: ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి సీజ్

Sathupally: ఖమ్మం సత్తుపల్లిలో ఒడిస్సా నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ. 90 లక్షల విలువైన 180 కేజీల గంజాయిని నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ అధికారులు సీజ్ చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 3 July 2026 9:31 PM IST
Sathupally
X

Sathupally: ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి సీజ్

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఒడిస్సా నుండి హైదరాబాదుకు కారు లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని రీజనల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ అధికారులు స్థానిక పోలీసుల సహకారం తో పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండల పరిధిలోని రేజర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సమీపంలో గంజాయి తరలిస్తున్న కారును నార్కోటిక్స్ సిబ్బంది మాటు వేసి పట్టుకున్నారు.

ఒడిస్సా రాష్ట్రం మల్కన్ గిరి ప్రాంతం నుండి ప్రబిన్ బత్ర అనే వ్యక్తి కారు ఓనర్ నాగేశ్వరరావు వద్ద రూ. 10 వేలకు సరుకు హైదరాబాద్ తరలించేందుకు బేరం కుదుర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు దాడి చేసి కారుతో పాటు గంజాయి, సెల్ ఫోను స్వాధీనం చేసుకొగా, ఒడిస్సా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతానికి చెందిన కార్ డ్రైవర్ బికారి, అలియాస్ రోహన్ తో పాటుగా కర్నూలు జిల్లా నంద్యాల కు చెందిన కారు ఓనర్ నాగేశ్వర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి సెల్ ఫోను ను నార్కోటిక్స్ సెల్ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 90 లక్షలు ఉంటుందని, గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని, దీనికి సంబంధించిన సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పట్టుబడిన ప్రబిన్ బత్ర గతంలో గంజాయి కేసులో నేరస్తుడిగా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story