Khammam: ఏదులాపురాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: పొంగులేటి!

Khammam: Khammam Edulapuram Municipality Revenue Minister Ponguleti Srinivas Reddy

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Oct 2026 2:00 PM IST
Khammam
X

Khammam: ఏదులాపురాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: పొంగులేటి!

ఖమ్మం: పాలేరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఈ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు సింగరేణి కాలనీలో రూ. 4.96 కోట్లతో అంతర్గత సిసి రోడ్లు, 8వ వార్డు లోని కోట నారాయణపురం నుంచి కోదాడ రోడ్డును కలుపుతూ నిర్మించే ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర.

టిఎస్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత లతో కలిసి మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటి వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 100 కోట్లకు పైగా కేటాయించామని, ఇంకా మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లను కేటాయించేందుకు కృషి చేస్తానని అన్నారు.

అర్హులైన పేదల కోసం నాలుగో విడత కూడా ఇందిరమ్మ ఇళ్లిస్తాం

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఒక్కో ఇంటికి రూ. 5లక్షలు కేటాయిస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు రూ. 40 వేల కోట్లను కేటాయించామని అన్నారు. హైదరాబాద్ లోని పేదల కోసం వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే లక్ష ఇళ్లను కేటాయిస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఇంకా అర్హులైన పేదలు ఉంటే.. మూడు, నాలుగో విడతల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని అభయమిచ్చారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇతర సంక్షేమ పథకాల్లో రాజకీయాలకతీతంగా అర్హులకు ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో..: ఏదులాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ బానోత్ కిషోర్ నాయక్, పలువురు కౌన్సిలర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్