Khammam: ఖమ్మంలో ఆక్రమణల తొలగింపు వైరా రోడ్డులో నిరంతరం స్పెషల్ డ్రైవ్

Khammam: ఖమ్మం వైరా రోడ్డులో ఆక్రమణలను తొలగించిన నగరపాలక సంస్థ, DRF అధికారులు. ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలు, గ్రిల్స్ తొలగింపుతో ట్రాఫిక్‌కు ఊరట.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Nov 2026 6:07 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఆక్రమణల తొలగింపు వైరా రోడ్డులో నిరంతరం స్పెషల్ డ్రైవ్

ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వైరా రోడ్డులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి పాత బస్టాండ్ వరకు ఆక్రములను తొలగింపు కార్యక్రమం నిర్వహించారు.

రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు, ఇనుప గ్రిల్స్, ఇతర అడ్డంకులను నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు సిబ్బంది DRF సిబ్బంది కలిసి తొలగించారు.

ప్రజలకు, పాదచారులకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తగ్గించి నగరంలో రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారులపై ఆక్రమణలు చేపట్టకుండా వ్యాపారులు, ప్రజలు సహకరించాలని అధికారులు సూచించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.