Khammam: బాలాజీ నగర్లో వైభవంగా గణేష్ పూజలు.. ఆకట్టుకున్న కోలాటం
Khammam: ఖమ్మం బాలాజీ నగర్లో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. మట్టి వినాయకుడి వద్ద మహిళల కోలాటం, పిల్లల నృత్యాలు. ప్లాస్టిక్కు దూరంగా పర్యావరణ హిత పూజలు.
Khammam: బాలాజీ నగర్లో వైభవంగా గణేష్ పూజలు.. ఆకట్టుకున్న కోలాటం
ఖమ్మం: ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లలో వినాయక మండపాల్లో 10వ రోజు పెద్ద ఎత్తున పూజలు జరుపుతున్నారు. ఖమ్మం నగరంలోని బాలాజీ నగర్ లో సుంకర రమేష్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణేష్ మండపం వద్ద మహిళలు కోలాటం పిల్లలు నృత్యాలు ఆకట్టుకున్నాయి.
గణేష్ ఉత్సవాలలో భాగంగా కోలాటం లో పాల్గొన్న మహిళలకు పిల్లలకు నిర్వాహకులు బహుమతులు అందించారు..భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ కోలాటం భజనలతో మట్టి వినాయక పూజలు చేయడం మన సంప్రదాయాలను గుర్తు చేసుకున్నట్లు ఉందని మహిళలు అన్నారు.
వినాయక ఉత్సవాల ద్వారా ప్రకృతి ని ఆర్తిస్తూ ఎటువంటి ప్లాస్టిక్ కు చోటివ్వకుండా మండపంలో పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు..కార్యక్రమంలో సుంకర రమేష్ కుటుంబ సభ్యులతో పాటు స్థానిక మహిళలు,పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




