Khammam: ఖమ్మంలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు..
Khammam: ఖమ్మం స్వర్ణభారతి కల్యాణ మండపంలో ఘనంగా నందమూరి తారకరామారావు 103వ జయంతి సంబరాలు.
Khammam: ఖమ్మంలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు..
ఖమ్మం: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలను కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వర్ణభారతి కమ్మవారి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన అమలు చేసిన పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొల్లు రఘు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చావా రాము, ఉపాధ్యక్షురాలు కర్నాటి రమాదేవి, సహాయ కార్యదర్శి వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మలకుమారి, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, నల్లమల ఆనంద్, మేదరమెట్ల స్వరూపరాణి, పోతినేని భూమేశ్వరరావు, కోలేటి నవీన్, నంబూరి ప్రసాద్, తాళ్లూరి మురళీకృష్ణ, బండి రవికుమార్, బతినేని ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.




