Khammam: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు
Khammam: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని గండుగులపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Khammam: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు
ఖమ్మం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా గండుగులపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఖమ్మం నగర మాజీ మేయర్ పునుకొల్లు నీరజ - రామబ్రహ్మం దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సరిపూడి సతీష్ గారు, చిరుమామిళ్ళ నాగేశ్వరరావు గారు, ఆళ్ల అంజిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.




