Khammam: ఖమ్మంలో ప్రపంచ బధిరుల దినోత్సవం: న్యాయ అవగాహన సదస్సు

Khammam: ఖమ్మం మానస జ్యోతి నివాస్ బధిరుల పాఠశాలలో ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 26 Sept 2026 9:43 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ప్రపంచ బధిరుల దినోత్సవం: న్యాయ అవగాహన సదస్సు

ఖమ్మం: ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి పి. దేవి మానస జ్యోతి నివాస్ అంధుల మరియు బధిరుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల చట్టం–2016, న్యాయ సేవాధికార సంస్థల చట్టం గురించి వివరించారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండే సమాచార, కమ్యూనికేషన్ సదుపాయాలు, వివక్ష లేకుండా విద్య, ఉపాధి అవకాశాలు, సమాజంలో సమాన భాగస్వామ్యం కల్పించడం యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేశారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చెప్పారు.

వివిధ రంగాల్లో దివ్యాంగులు సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, సంకేత భాషా అనువాదకులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.