Khammam: ఎంపీ వద్దిరాజు నివాసంలో బతుకమ్మ సంబరాలు

Khammam: ఖమ్మంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో బీఆర్ఎస్ మహిళా నేతలు బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. ఆడబిడ్డలకు ఎంపీ దంపతులు చీర సారెతో సత్కరించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 Oct 2026 10:44 PM IST
Khammam
X

Khammam: ఎంపీ వద్దిరాజు నివాసంలో బతుకమ్మ సంబరాలు

ఖమ్మం జిల్లా: ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బతుకమ్మ ఘనంగా జరుగుతున్న సంబురాల్లో పాల్గోనేందుకు ఖమ్మం చేరుకున్న బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సాధర స్వాగతం పలికారు.

మధ్యాహ్నం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసానికి చేరుకున్న ఆడబిడ్డలు.. స్వయంగా పాటలు పాడుతూ, సాంప్రదాయబద్దంగా బతుకమ్మ పేర్చారు.

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్ రెడ్డి, మాజీ విప్ గొంగడి సునితా రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ కార్పొరేషన్ చైర్ పర్సన్లు రజినీ సాయిచంద్, మంత్రి శ్రీదేవి, వద్దిరాజు అనీల పలువురు మహిళల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దగ్గరుండి మహిళ నేతలకు పూలు, పూజా సామాన్లను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అందజేశారు.

సోదరీమణులు పాటలు పాడుతూ బతుకమ్మలు పేరుస్తుంటే రవిచంద్ర సాయం అందించారు. అనంతరం వద్దిరాజు రవిచంద్ర నివాసంలో బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు బృందం బతుకమ్మ ఆడారు.‌ తన ఇంటికి విచ్చేసిన మహిళా సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానించిన వద్దిరాజు కుటుంబ సభ్యులు..

వారిని చీర సారె తో సత్కరించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.