Khammam: నిర్మాణాల పురోగతిని తనిఖీ చేసిన కమిషనర్ అభిషేక్ అగస్త్య!
Khammam: వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఐఏఎస్. దవాఖాన, పార్క్, అంగన్‌వాడీ స్థలాల తనిఖీ.
Khammam: నిర్మాణాల పురోగతిని తనిఖీ చేసిన కమిషనర్ అభిషేక్ అగస్త్య!
ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐఏఎస్ ఈరోజు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులు ఏ దశలో కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు ఎంత మేరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.
అదేవిధంగా వెలుగుమట్లలో నిర్మించనున్న దవాఖాన, కమ్యూనిటీ హాల్, పార్క్, అంగన్‌వాడీ కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్ తదితర మౌలిక వసతుల కోసం కేటాయించిన ప్రదేశాలను కూడా కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ శ్రీనివాసులు, కేఎంసీ ఈఈ మురళి, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




