Khammam: డీఆర్ఎఫ్ సిబ్బందికి యూనిఫామ్‌లు అందజేసిన కమిషనర్

Khammam: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో విపత్తుల నిర్వహణలో సేవలందిస్తున్న డీఆర్ఎఫ్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య యూనిఫామ్‌లను అందజేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 16 Nov 2026 9:37 PM IST
Khammam
X

Khammam: డీఆర్ఎఫ్ సిబ్బందికి యూనిఫామ్‌లు అందజేసిన కమిషనర్

ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందిస్తూ, విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య యూనిఫామ్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, డీఆర్ఎఫ్ సిబ్బంది విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన సౌకర్యాలు, రక్షణ సామగ్రి అందుబాటులో ఉండాలని తెలిపారు. సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

అనంతరం డీఆర్ఎఫ్ సిబ్బందికి యూనిఫామ్‌లతో పాటు విధి నిర్వహణకు అవసరమైన షూస్, సాక్స్‌లు తదితర సామగ్రి ఇంకా ఏమైనా అవసరమైతే వెంటనే గుర్తించి సమకూర్చాలని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి జాప్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.