Khammam: ఖమ్మంలో ఇందిరమ్మ లబ్ధిదారులతో అధికారుల దీపావళి

Khammam: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో మున్సిపల్ అధికారులు దీపాలు వెలిగించి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Nov 2026 7:30 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ఇందిరమ్మ లబ్ధిదారులతో అధికారుల దీపావళి

ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో మంజూరైన ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో మున్సిపల్ అధికారులు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన రంగు హనుమంత ఆచారి, పుష్పావతి గార్ల నివాసాలకు మున్సిపల్ అధికారులు వెళ్లి, లబ్ధిదారులతో కలిసి ఇంట్లో దీపాలు వెలిగించి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో, పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి పేద కుటుంబం తమ కలల ఇంటిని నిర్మించుకోవాలనే ఆశయంతో ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

సొంతింటి కల సాకారమవుతున్న వేళ లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించి వారితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి లబ్ధిదారుడు తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.