Khammam: అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు!

Khammam: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.ఆర్. బంజారా శివారులోని బొప్పాయి తోటలో అప్పుడే పుట్టిన మగ శిశువు లభ్యం. ఆస్పత్రికి తరలించిన అంగన్‌వాడీ సిబ్బంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Oct 2026 12:17 PM IST
Khammam
X

Khammam: అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు!

Khammam: ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలం వి.ఆర్. బంజారా గ్రామ శివారులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ బొప్పాయి తోటలో అప్పుడే జన్మించిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శిశువును గమనించిన అంగన్వాడీ సిబ్బంది వెంటనే స్పందించి, ఖమ్మం ప్రభుత్వ మాతా శిశు కేంద్రానికి తరలించారు.

కాగా, శిశువును అక్కడ వదిలివెళ్లిన వ్యక్తులు ఎవరనే విషయంపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నవజాత శిశువును సురక్షితంగా సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్