Khammam: ఖమ్మంలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ రూ.32 లక్షల బంగారం స్వాధీనం
Khammam: ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో వరుస దొంగతనాల నిందితుడు ఏసోబు అరెస్ట్. 32 తులాల బంగారం రికవరీ. నిందితుడిపై గతంలో 22 కేసులు.
Khammam: ఖమ్మంలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ రూ.32 లక్షల బంగారం స్వాధీనం
ఖమ్మం: గత కొన్ని నెలలుగా రాత్రి పూట తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.
మంగళవారం సాయంత్రం నగరంలోని కిన్నెర హోటల్ ఎదురుగా వున్న పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఖమ్మం టూ టౌన్, సిసిఎస్ పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన ఆత్కూరు గ్రామం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సెన్ట్రింగ్ వర్కర్ అయిన నిందితుడు కంబంపాటి ఏసోబు @ కందుల సురేష్ రెడ్డి, 45సం ను అదుపులోకి తీసుకొని విచారించగా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్టాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్ళల్లో దొంగతనాలు చేసి, పలుసార్లు జైలు శిక్షలు అనుభవించాడని ,ఇతనిపై గతంలో 22 దొంగతనాల కేసులలో నిందితుడు గా ఉన్నట్లు తెలిపారు.నిందితుడు నుండి 32 లక్షల విలువ చేసే 32 తులాల బంగారు ఆభరణాలు, 40 వేల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు.
గత సంవత్సరం నుండి వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో చేసిన దొంగతనాల వివరాల ప్రకారం...1) ఖమ్మం 2వ టౌన్-4 2)ఖానాపురం హవేలీ -3 3) వేంసూరు-1,4) VM బంజర -1, 5)చిల్లకల్లు -1, 6)తిరువూరు -1 ల్లో దొంగతనాలు చేసాడని ఏసీపీ తెలిపారు.సమావేశంలో ఇన్స్పెక్టర్లు, కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.




