Khammam: పని ప్రదేశాల్లో వేధింపులకు ‘పోష్’తో చెక్: ఖమ్మంలో మహిళా ఉద్యోగినులకు పోలీసుల అవగాహన!

Khammam: ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేధింపులకు గురైతే 181, 100 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.

M RAVIKIRAN
Published on: 30 April 2026 10:34 AM IST
Khammam
X

Khammam: పని ప్రదేశాల్లో వేధింపులకు ‘పోష్’తో చెక్: ఖమ్మంలో మహిళా ఉద్యోగినులకు పోలీసుల అవగాహన!

ఖమ్మం: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సునీల్ దత్ గారి సూచనలతో పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శివనాథుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు అనే అంశంపై ఖమ్మం నగరం నందు వివిధ ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది

ముందుగా వైరా రోడ్డు నందు గల జీవి మాల్ లోని మహిళా లకు తరువాత ఇల్లందు క్రాస్ రోడ్ నందు గల ఐటీ హబ్ లో ఉన్న ఉద్యోగినులకు అటుపై మూడవ పట్టణ పరిధిలో గల అటవీ కేంద్రం నందు గల మహిళా ఉద్యోగినులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది

ఈ సందర్భంగా ఏఎస్ఐ జ్యోతి మాట్లాడుతూ....

మన సమాజంలో ఒక గాయం – పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు. ఇది కేవలం ఒక సమస్య కాదు, మన మహిళల గౌరవం, భద్రతకు ముప్పు. భారతదేశంలో ప్రతి 10 మంది మహిళల్లో 6 మంది పని చేస్తున్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఆఫీసులు, ఫ్యాక్టరీలు, షాపులు – ఎక్కడైనా జరుగుతోంది.

2013లో వచ్చిన *పోష్ (POSH) చట్టం* – పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం – దీని ప్రకారం ప్రతి సంస్థలో *ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ICC)* ఏర్పాటు చేయాలి. మూడు నెలల లోపు ఫిర్యాదు చేయవచ్చు అని ఫిర్యాదు చేసిన 90 రోజులలోపు సమస్య పరిష్కరించబడుతుందని ఆమె తెలిపారు.

తెలంగాణలో రాష్ట్రంలో RDO కార్యాలయాలు, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఈ కమిటీలను పర్యవేక్షిస్తాయి అని తెలుపుతూ కమిటీ వద్ద పరిష్కారం లభించకపోతే జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నందు కూడా ఫిర్యాదు చేయవచ్చని మహిళలు ధైర్యంగా ఈ విషయంపై మాట్లాడాలని తెలిపారు.70% మంది మహిళలు భయంతో మౌనంగా ఉండిపోతున్నారని నిశ్శబ్దాన్ని చేదిస్తేనే న్యాయం జరుగుతుందని ఇతరులకు కూడా ఆదర్శంగా నిలవచ్చు అని పిలుపునిచ్చారు

పోలీస్ డిపార్ట్మెంట్ షీ టీం భరోసా కేంద్రాల ద్వారా నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంస్థలో POSH శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ఫిర్యాది రహస్యంగా హెల్ప్‌లైన్ నంబర్లు 181, 100, 112 లను ఉపయోగించి కూడా తెలియజేయవచ్చని అన్నారు. మహిళా న్యాయవాదులు ఉన్నత స్థాయి అధికారులు పురుషులు ప్రతి ఒక్కరు ఇలా సహకరిస్తే పని ప్రదేశంలో వేధింపులను నిరోధించి మహిళలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా దేశ ప్రగతిలో కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్యవివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు 18 సంవత్సరాల లోపు బాలికకు 21 సంవత్సరాలలోపు మగ వ్యక్తి వివాహం చేయకూడదు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ హెచ్ టి యూ ఇన్స్పెక్టర్ - శివనాథుల శ్రీనివాస్, ఏ ఎస్ఐ జ్యోతి, ఏ హెచ్ టి యు -భాస్కర్, కానిస్టేబుల్స్ రాణి రుక్మిణి, ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్ ఉమెన్ హబ్ బాధ్యులు సమరీన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

M RAVIKIRAN

M RAVIKIRAN

Next Story