Khammam: పువ్వాడ ఉదయ్‌నగర్‌లో నార్కోటిక్ జాగిలాలతో విస్తృత తనిఖీలు

Khammam: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం పువ్వాడ ఉదయ్‌నగర్‌లో గంజాయి విక్రయాలపై నార్కోటిక్ జాగిలాలతో ముమ్మర తనిఖీలు నిర్వహించిన ఇన్స్పెక్టర్ కరుణాకర్.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 12 Nov 2026 7:54 PM IST
Khammam
X

Khammam: పువ్వాడ ఉదయ్‌నగర్‌లో నార్కోటిక్ జాగిలాలతో విస్తృత తనిఖీలు

ఖమ్మం: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వివిధ దుకాణాలలో గంజాయిని చాక్లెట్లు, సిగరెట్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారని సమాచారం మేరకు రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో పువ్వాడ ఉదయ్ నగర్ పరిసరాలలో పాడుబడ్డ బంగ్లాలు, నిర్మానుష ప్రాంతాలు, పార్కులు, కిరాణా దుకాణాలు, పాన్‌డబ్బాలలో తనిఖీలు ముమ్మరం చేశారు.

గంజాయి హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు ముసుగులో జరుగుతున్న అక్రమ అమ్మకాలను పోలీసులు పసిగట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పరిసర ప్రాంతాలలో, ప్రాంగణానికి సమీపంలోని దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించేలా తనిఖీలు చేపట్టారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.