Khammam: ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో ఖమ్మం సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ!

Khammam: నవంబర్ 29న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షల నేపథ్యంలో ఖమ్మంలో 34 కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ. పొరపాట్లకు తావులేకుండా చర్యలు: అడిషనల్ డీసీపీ రామానుజం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Nov 2026 5:53 PM IST
Khammam
X

Khammam: ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో ఖమ్మం సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ!

Khammam: ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షల నిర్వహణలో ప్రిలిమినరీ పారదర్శకత, క్రమశిక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని అడిషనల్ డీసీపీ (నోడల్ ఆఫీసర్) రామానుజం అధికారులు సూచించారు.

తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో నవంబర్ 29, ఆదివారం నిర్వహించనున్నా సబ్​-ఇన్​స్పెక్టర్(SI) ప్రిలిమినరీ రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి 34 పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తించే 95 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ సిబ్బందికి బయోమెట్రిక్ విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉమేన్స్ డిగ్రీ కాలేజ్ లో నిర్వహించారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు నిర్ధారణ, బయోమెట్రిక్ వివరాల నమోదు, వేలిముద్రల సేకరణ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. బయోమెట్రిక్ ప్రక్రియను నిబంధనల ప్రకారం ఎలాంటి సాంకేతిక లోపాలకు తావులేకుండా నిర్వహించే విధానాన్ని వివరించారు.

కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ బానోత్ రెడ్డి (ప్రిన్సిపాల్ ఉమేన్స్ కాలేజ్) , అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ సాంబరాజు, పోలీస్ బయోమెట్రిక్ ఆఫీసర్ లవన్ కుమార్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్