Khammam: నవంబర్ 23న ఖమ్మం ప్రజావాణి రద్దు కలెక్టర్ దివాకర టిఎస్

Khammam: పరిపాలనా అవసరాల దృష్ట్యా నవంబర్ 23న ఖమ్మం ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టిఎస్ ప్రకటన; దరఖాస్తులను కౌంటర్లలో ఇవ్వాలని సూచన.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 22 Nov 2026 10:45 PM IST
Khammam
X

Khammam: నవంబర్ 23న ఖమ్మం ప్రజావాణి రద్దు కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం: పరిపాలనా అవసరాల దృష్ట్యా నేడు (నవంబర్ 23న) సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నవంబర్ 23న ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఆ రోజు జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉండరని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించవచ్చని, ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి, సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.