Khammam: నవంబర్ 29 దీక్షా దివస్‌కు తరలిరండి పువ్వాడ అజయ్

Khammam: ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే దీక్షా దివస్‌కు తరలిరావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చి, కేసీఆర్ పోరాటాన్ని కొనియాడారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 28 Nov 2026 11:59 PM IST
Khammam
X

Khammam: నవంబర్ 29 దీక్షా దివస్‌కు తరలిరండి పువ్వాడ అజయ్

ఖమ్మం: స్వరాష్ట్ర సాధన కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే అచంచల సంకల్పానికి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రతీకగా నిలిచిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాధన లక్ష్యంతో ఉద్యమ దళపతి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాగ్నిగా మారిన రోజు(నవంబర్ 29) దీక్షా దివస్ అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని, స్వరాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకోవడంతో పాటు నేడు తెలంగాణ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన బాధ్యతను దీక్షా దివస్ గుర్తుచేస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.