Khammam: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ గెలవాలి: పువ్వాడ అజయ్

Khammam: ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Oct 2026 3:58 PM IST
Khammam
X

Khammam: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ గెలవాలి: పువ్వాడ అజయ్

ఖమ్మం: రాబోయే పట్టభద్రుల ఖమ్మం, నల్గొండ,వరంగల్ (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి విజయం కోసం ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేయాలని మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీందర్ రావు..

ఖమ్మంలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో దాదాపు ప్రస్తుతం 28,500 ఓట్లు ఉన్నాయని, ప్రతి 100 ఓట్లకు ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్) చొప్పున అదనంగా 325 మందికి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (SIR) తరహాలోనే ఈసారి కూడా ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రుల వివరాలు సేకరించాలన్నారు.

డివిజన్ల వారీగా ప్రత్యేకంగా టెంట్లు, గుడారాలు, లేదా పార్టీ కార్యాలయాల వద్ద ఎన్‌రోల్‌మెంట్ క్యాంపులు ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియను ఉధృతం చేస్తున్నామని చెప్పారు. తానూ స్వయంగా వచ్చే నెల రోజుల్లో కనీసం వారానికి రెండు రోజులు ఈ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటానని ప్రకటించారు.

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వైద్యులు, న్యాయవాదులు, బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను గుర్తించి ప్రత్యక్షంగా కలిసి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.

గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచే అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించి విజయంలో కీలక పాత్ర పోషించామని గుర్తుచేశారు. అదే ఉత్సాహంతో ఈసారి కూడా పని చేయాలన్నారు.

పట్టభద్రుల ఎన్నికలు రాబోయే కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నాంది అని, ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ సాధించే విజయం రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో Rjc కృష్ణ,బచ్చు విజయ్ కుమార్, పగడాల నాగరాజు,ఖమర్,మాజీ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ,షేక్ మక్బుల్,శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల కోటేశ్వరరావు, జ్యోతి రెడ్డి, పల్లా రోజ్లీనా,కమల,బుడిగం శ్రీను, బుర్రి వెంకటేశ్వర్లు,బిక్కసాని ప్రశాంతిజస్వంత్,పసుమర్తి రామ్మోహన్, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, నాయకులు మెంతుల శ్రీశైలం,కొత్త వెంకటేశ్వర్రావు పాషా,బత్తుల మురళి, వీరు నాయక్,పిన్ని కోటేశ్వరరావు, గుత్తా రవి, మద్దినేని వెంకటరమణ, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మెంటం రామారావు,ప్రదీప్, సర్పంచ్లు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.