Khammam: ఖమ్మం జిల్లాలో టాటా ఏస్ వాహనంలో ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం!

Khammam: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.ఆర్. బంజరలో టాటా ఏస్ వాహనంలో ప్రమాదకరంగా పాఠశాల విద్యార్థుల ప్రయాణం. గ్రామ ఉపసర్పంచే తీసుకెళ్తున్న వైనం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Nov 2026 9:03 AM IST
Khammam
X

Khammam: ఖమ్మం జిల్లాలో టాటా ఏస్ వాహనంలో ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం!

Khammam: చిన్నారుల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారా..? పాఠశాల విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారా..? ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.ఆర్. బంజర గ్రామంలో టాటా ఏస్ మ్యాజిక్ వాహనంలో స్కూల్ పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఘటన కలకలం రేపుతోంది.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. అధికార పార్టీకి చెందిన గ్రామ ఉపసర్పంచ్ స్వయంగా విద్యార్థులను టాటా ఏస్ మ్యాజిక్ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్తున్నట్లు స్థానికంగా వెల్లడైన దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. చిన్నారులను ఇలా సరైన భద్రతా ఏర్పాట్లు లేని వాహనంలో తరలించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థుల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి ఘటనపై విచారణ జరిపి, ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్