Khammam: ఇందిరా గాంధీ జీవిత బీమా నమోదు కేంద్రాల తనిఖీ
Khammam: ఖమ్మం 21, 22, 23, 25, 37, 38, 39 డివిజన్లలో ఇందిరా గాంధీ జీవిత బీమా నమోదు కేంద్రాలను తనిఖీ చేసిన సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, ఖాదర్ బాబా.
Khammam: ఇందిరా గాంధీ జీవిత బీమా నమోదు కేంద్రాల తనిఖీ
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా గాంధీ జీవిత భీమా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా కోరారు.
ఖమ్మం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని 21,22,23,25,37,38,39 వివిధ డివిజన్లలో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాలను ఇరువురు నాయకులు సందర్శించి, అక్కడ జరుగుతున్న ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకంలో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్‌లోని నాయకులు ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిటీ అర్బన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా ముక్తార్ షేక్, మాజీ కార్పొరేటర్లు అల్లా నిరీషా అంజిరెడ్డి, ఆలియా షౌకత్ అలీ, గొల్ల చంద్రకళ వెంకట్, మడూరి ప్రసాద్, సీనియర్ నాయకులు పాలకుర్తి నాగేశ్వరరావు, సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్, చండ్ర శేషి, తాళ్లూరి వెంకటేశ్వరులు, మడూరి సైదారావు, డివిజన్ అధ్యక్షులు వంగ సతీష్, వల్లూరి జాన్సీ, షేక్ మహమూద్, గిరిబాబు, పాలకుర్తి వెంకన్న, కమర్తపు రవీందర్, అప్సర్, మున్సిపల్ సహాయ కమిషనర్ అనిల్ కుమార్, సంబంధిత వార్డు ఆఫీసర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..




