Khammam: కవిత అనుచిత వ్యాఖ్యలపై గర్జించిన ఖమ్మం తెలుగు మహిళ నేతలు
Khammam: ఖమ్మంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై రేగిన రాజకీయ మంటలు.
Khammam: కవిత అనుచిత వ్యాఖ్యలపై గర్జించిన ఖమ్మం తెలుగు మహిళ నేతలు
ఖమ్మం: ఇటీవల హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత ఎన్టీఆర్ విగ్రహం పై చేసిన వ్యాఖ్యలకు స్పందించి తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ముందుగా మహిళా నాయకురాళ్ళు పాదయాత్రగా బయలుదేరి డౌన్ డౌన్ కవిత అంటూ నినాదాలతో ఎన్టీఆర్ సర్కిల్ లో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు, అన్నగారి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు చుండూరు రాజరాజేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కవిత తాము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ విగ్రహం కూల్చి ఆంధ్రకు పంపిస్తామని చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని వెంటనే వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు, నీ తండ్రి కెసిఆర్ కు రాజకీయ బిక్ష పెట్టింది ఎవరో తెలుసుకోని మాట్లాడాలని, బతుకునిచ్చిన బాంధవుడు పేరు నీ అన్నకు ఎందుకు పెట్టారో మీ తండ్రిని అడుగు అని అన్నారు.
మీ అన్న కేటీఆర్ మీ తండ్రి గారైన కెసిఆర్ నోటి దూల మాటలకే ఇంట్లో కూర్చున్నారు, టిడిపి జోలికి వస్తే బిఆర్ఎస్ పార్టీకి ఏం జరిగిందో తెలుగు ప్రజలకు తెలుసు అన్నారు, మా కార్యకర్తల దెబ్బకు బిఆర్ఎస్ నే పాతాళనికి తొక్కాం నువ్వెంత అని అన్నారు, ఎక్కడో బ్యూటీ పార్లర్ నడుపుకొనే నీకు అయ్యా చాటున అవినీతి చేసి ఎదిగిన నువ్వు మహానుభావుడు ఎన్టీఆర్ గారి విగ్రహం టచ్ చేసే స్థాయి నీకు లేదు ఖబడ్దార్ అని అన్నారు.
కవిత నీ సంగతేందో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియదా బతుకమ్మ ఆడుతూ అందరి దృష్టి మరల్చి 200 కోట్లతో మద్యాన్ని ఢిల్లీ, బీహార్, దాక మోసకపోయి తెలుగు ఆడపడుచుల గౌరవం తీసి ఒక మహిళ చేయకూడని మద్యం కుంభకోణం చేసి జైలు పాలైతివి తెలంగాణ రాష్ట్రా ప్రజల సంపద దోచి వాటి పంపకాల్లో కుటుంబ విభేదాలు తలెత్తి వేరే పార్టీ పెట్టిన నీవు వార్డు మెంబర్ గా గెలవలేవు సీఎం అయితావా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మీ కుటుంబ పార్టీలు ఇలాంటి వ్యాఖ్యలతో భూస్థాపితం అవడం ఖాయం అని అన్నారు. ఇకనైనా మీరు మీ కుటుంబం టిడిపి నేతలపై నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి లేకుంటే తెలంగాణలో తిరగనివ్వం ఖబడ్దార్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేకల సత్యవతి, మందపల్లి రజిని, కోనేరు రాణి, తాడిశెట్టి స్వాతి, సౌలం లావణ్య, వలగపూడి విజయలక్ష్మి, రంగిశెట్టి మంగమ్మ, మట్టరీ రాణి, మేడిపల్లి రమాదేవి, బేబీ వైదేహి మహిళా అభిమానులు, పాలడుగు కృష్ణ ప్రసాద్, మీగడ రామారావు, వాసిరెడ్డి భాస్కరరావు, కృష్ణమాచారి, ఎల్లంకి నరసింహారావు, బి.రాందాస్ అనంత కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.




