Khammam: సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం - మంత్రి తుమ్మల

Khammam: పేదల సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం రానున్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Updated on: 14 Nov 2026 9:18 PM IST
Khammam
X

Khammam: సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం - మంత్రి తుమ్మల

ఖమ్మం: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, పేదల సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ...

డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రానున్నారు. వెలుగుమట్ల మోడల్ కాలనీ, మున్నేరు కేబుల్ బ్రిడ్జి, మిర్చి మార్కెట్‌లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నాలుగున్నర లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశాం.

ఇందిరమ్మ రాజ్యంలో మొత్తం 45 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. వృద్ధులు తమ పిల్లలపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలన్నదే చేయూత పింఛన్ల ప్రధాన ఉద్దేశం. సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోంది.

సాగునీరు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వం అప్రమత్తం

ఎల్‌నినో ప్రభావంతో నాగార్జునసాగర్ నుంచి ఆశించిన స్థాయిలో నీరు అందలేదని మంత్రి తెలిపారు. అయినప్పటికీ ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందన్నారు.

సాగర్ ఆయకట్టు పరిధిలోని సుమారు లక్షన్నర ఎకరాల పంటలను గోదావరి జలాలను మళ్లించడం ద్వారా కాపాడుకోగలిగామని వివరించారు.

మురసు తుఫాన్ కారణంగా రైతులు చేతికందిన పంటలను కోల్పోవడం బాధాకరమని, ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మం నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ఖమ్మం నగరంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ఫుట్‌పాత్‌లను అందుబాటులో ఉంచాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.