Khammam: తలసేమియా బాధితులకు పింఛన్లు - మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు

Khammam: తలసేమియా బాధిత చిన్నారులకు చేయూత పింఛన్లు మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధితులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 14 Nov 2026 8:04 PM IST
Khammam
X

Khammam: తలసేమియా బాధితులకు పింఛన్లు - మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు

ఖమ్మం: తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న చొరవపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. చేయూత పథకం కింద పింఛన్లు మంజూరు చేయించడంతో తమకు ఎంతో ఊరట లభించిందని పేర్కొంటూ శుక్రవారం పలువురు తలసేమియా బాధితులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో ఎంపీగా ఉన్నప్పుడే తలసేమియా బాధితుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించిన పొంగులేటి.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కూడా వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గుర్తుచేశారు. ఆయన చొరవతో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ పరిధిలోని సుమారు 150 మంది చిన్నారులతో పాటు జిల్లాలోని వందలాది మంది బాధితులకు పింఛన్లు మంజూరు కానుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

తమ కష్టాలను గుర్తించి ఆర్థికంగా అండగా నిలిచిన శీనన్నకు చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు, సంస్థ ఉపాధ్యక్షురాలు పొద్దుటూరి పావని, సభ్యులు అనిత, ఉదయ భాస్కర్ తదితరులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.