Sathupalli: చోరీకి యత్నించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ దొంగలు
Sathupalli: సత్తుపల్లి గాంధీనగర్‌లో కూల్‌డ్రింక్ షాపులో దొంగతనానికి యత్నించిన ఇద్దరు నిందితులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బైక్, బ్యాగ్ స్వాధీనం.
Sathupalli: చోరీకి యత్నించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ దొంగలు
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గాంధీనగర్ శివారులో దొంగతనం చేసేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గాంధీనగర్ శివారులోని ఓ కూల్‌డ్రింక్ షాపు వద్దకు అర్ధరాత్రి బైక్‌పై వచ్చి ఇద్దరు దుండగులు షాపు ఎదురుగా ఉన్న లైట్ ను పగలగొట్టి చోరీకి యత్నించారు.గమనించిన స్థానికులు చాకచక్యంగా ఇద్దరు దొంగలనూ పట్టుకున్నారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన బైక్,బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు.ప్రాథమిక విచారణలో నిందితులు సత్తుపల్లికే చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే ఇటీవల ఇదే ప్రాంతంలో జరిగిన మరో కూల్‌డ్రింక్ షాప్ లో చోరీకి పాల్పడింది కూడా తామేనని నిందితులు స్థానికుల ఎదుట అంగీకరించారు.
ఈ చోరీల్లో వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన మరో ఇద్దరి ప్రమేయం ఉందని తెలింది..వరుస దొంగతనాలతో వ్యాపారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నిందితులపై వారి సహచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు,వ్యాపారులు పోలీసులను కోరారు..




