Vemsuru: వేంసూరులో 101 నూతన పింఛన్ల మంజూరుపై లబ్ధిదారుల హర్షం!
Vemsuru: ఖమ్మం జిల్లా వేంసూరులో 101 నూతన పింఛన్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే మట్టా రాగమయి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
Vemsuru: వేంసూరులో 101 నూతన పింఛన్ల మంజూరుపై లబ్ధిదారుల హర్షం!
వేంసూరు: వేంసూరు గ్రామంలో నూతనంగా 101 పింఛన్లు (వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, గీత కార్మికుల పింఛన్లు) మంజూరు కావడంపై లబ్ధిదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎండీ ఫకృద్దీన్ ఆధ్వర్యంలో నూతన పింఛన్ లబ్ధిదారులు స్వయంగా తరలివచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
అత్యధిక సంఖ్యలో అర్హులైన పేదలకు పింఛన్లు మంజూరు చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన సర్పంచ్ ఎండీ ఫకృద్దీన్‌కు లబ్ధిదారులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెల్లి నరసింహాస్వామి, ఏఎంసీ (AMC) డైరెక్టర్ ఇబ్రహీం, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ ఇబ్రహీం, జనరల్ సెక్రటరీ వేల్పుల నవకుమార్, రహీం, మాజీ ఉప సర్పంచ్ మల్లెల్లి నాగేశ్వరరావు, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు




