Kothagudem: జాతీయ లోక్ అదాలత్‌లో 5,774 కేసులు పరిష్కారం

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా ముగిసిన జాతీయ లోక్ అదాలత్. జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల్లో 5,774 కేసులు పరిష్కరించినట్లు అధికారుల వెల్లడి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 12 Sept 2026 11:32 PM IST
Kothagudem
X

Kothagudem: జాతీయ లోక్ అదాలత్‌లో 5,774 కేసులు పరిష్కారం

కొత్తగూడెం: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,774 కేసులు పరిష్కారమయ్యాయి. శనివారం జిల్లా పరిధిలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, పీఎల్‌సీ, ట్రాఫిక్ చలాన్ తదితర కేసులను పరిష్కరించారు.

కొత్తగూడెంలో అత్యధికంగా 3,384 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 32 సివిల్ కేసులు, 2,391 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 8 మోటార్ వాహన ప్రమాద కేసులు రూ.37.50 లక్షలకు పరిష్కరించారు. అదేవిధంగా బ్యాంకు కేసులు 193, టెలిఫోన్ కేసులు 9, సైబర్ క్రైమ్ కేసులు 57, ట్రాఫిక్ చలాన్ కేసులు 702 పరిష్కరించారు.

ఇల్లందులో 602 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 11 సివిల్, 347 క్రిమినల్ కేసులతో పాటు బ్యాంకు, ప్రామిసరీ నోట్ కేసులు 169, ట్రాఫిక్ చలాన్ కేసులు 75 ఉన్నాయి.

భద్రాచలంలో 1,121 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 1,057 క్రిమినల్ కేసులు, 27 బ్యాంకు, పీఎల్‌సీ కేసులు, 37 ట్రాఫిక్ చలాన్ కేసులు ఉన్నాయి.

మణుగూరులో 422 కేసులు పరిష్కారం కాగా.. ఇందులో 338 క్రిమినల్, 32 బ్యాంకు పీఎల్‌సీ, 52 ట్రాఫిక్ చలాన్ కేసులు ఉన్నాయి. దమ్మపేటలో 245 కేసులు పరిష్కరించారు. వీటిలో 168 క్రిమినల్, 2 సివిల్, 38 బ్యాంకు పీఎల్‌సీ, 37 ట్రాఫిక్ చలాన్ కేసులు ఉన్నాయి.

లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని న్యాయ సేవాధికార సంస్థ అధికారులు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM