Kothagudem: కొత్తగూడెంలో 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు
Kothagudem: కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు 9 రోజుల పాటు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి.
Kothagudem: కొత్తగూడెంలో 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కొత్తగూడెంలో తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి విద్యానగర్ కాలనీలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు.
గత ఐదేళ్లుగా కొత్తగూడెం నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది మరింత విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ హెల్త్ డైరెక్టర్ డా. గడల శ్రీనివాసరావు వేడుకల్లో పాల్గొననున్నారు.
ప్రతిరోజూ అత్యుత్తమంగా అలంకరించిన బతుకమ్మకు పట్టుచీరను ప్రథమ బహుమతిగా అందించడంతో పాటు మరో నలుగురు మహిళలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నారు. నియోజకవర్గం, పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.




