Kothagudem: కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా యూరియా పంపిణీ.. జెడ్ఏఓ

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు సకాలంలో అందుబాటులో యూరియా ఎరువులు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 19 Jun 2026 8:55 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా యూరియా పంపిణీ.. జెడ్ఏఓ

Kothagudem: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన యూరియా బుకింగ్ విధానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు.

జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచడంతో పాటు, బుకింగ్ చేసిన రైతులకు వేగవంతంగా సరఫరా చేస్తున్నామన్నారు.

జూన్ 19, 2026 నాటికి జిల్లాలో మొత్తం 10,014 మంది రైతులు యూరియా బుకింగ్ చేసుకోగా, 39,944 బస్తాల యూరియా బుక్ చేయబడింది. ఇందులో 28,980 బస్తాలు రైతులకు పంపిణీ చేయడం ద్వారా 72.66 శాతం సరఫరా పూర్తయింది. ప్రస్తుతం జిల్లాలో 1,304.10 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో PACS, రైతు వేదికలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఏఈఓలు, ఏఓలు, మండల వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఎరువుల పంపిణీని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రైతులు అవసరమైన మేరకు మాత్రమే యూరియాను బుక్ చేసుకోవాలని, అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని సూచించారు.

రైతులు యూరియా బుకింగ్, సరఫరా మరియు ఇతర వ్యవసాయ సేవలకు సంబంధించి సమీప వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), వ్యవసాయ అధికారి (AO) లేదా మండల వ్యవసాయ అధికారి (MAO)లను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story