Kothagudem: అంగన్వాడీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట AITUC ఆధ్వర్యంలో అంగన్వాడీల ధర్నా. అద్దెలు, గ్యాస్ బిల్లులు, వేతన పెంపు హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్.
Kothagudem: అంగన్వాడీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు, ఆరోగ్యలక్ష్మి బిల్లులు, ఈవెంట్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ AITUC ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా AITUC రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల అద్దెలు, గ్యాస్ బిల్లులు, ఆరోగ్యలక్ష్మి బిల్లులు, ఈవెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన రూ.18 వేల వేతన పెంపు హామీని వెంటనే అమలు చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులకు దసరా సెలవులు మంజూరు చేయాలని, ఉద్యోగ విరమణ సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, పెండింగ్ బిల్లులను విడుదల చేయడంతో పాటు కేంద్రాల నిర్వహణకు అవసరమైన నిధులను సకాలంలో అందించాలని నరాటి ప్రసాద్ కోరారు. అనంతరం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
ఈ ధర్నాలో AITUC జిల్లా నాయకులు వేల్పుల మల్లికార్జున్, భూక్యా శ్రీనివాస్, గోనే మణి, రెడ్డి అరుణ, భూక్యా లలిత, విజయ. భారతి.సంధ్య, ప్రమీల.చిన్నారి, విజయ లక్మి. తదితరులు పాల్గొన్నారు.




