Kothagudem: అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా గర్భిణీలకు శ్రీమంతాలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం 31వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు ఘనంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.
Kothagudem: అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా గర్భిణీలకు శ్రీమంతాలు!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీల కోసం శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 31వ డివిజన్ కార్పొరేటర్ శ్యామల దినేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణీలకు చీరలు, పూలు, పండ్లు అందజేసి వారిని సత్కరించారు. అనంతరం కార్పొరేటర్ శ్యామల దినేష్ మాట్లాడుతూ.. తన చేతుల మీదుగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అంగన్వాడీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.




