Kothagudem: భూ పునఃసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఐడీఓసీలో భూ పునఃసర్వేపై సిబ్బందికి శిక్షణ నిర్వహించగా, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని సీసీఎల్ఏ ఏడీ సూచించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 Nov 2026 11:44 PM IST
Kothagudem
X

Kothagudem: భూ పునఃసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

కొత్తగూడెం: భూ పునఃసర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహనతో సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ CCLA అసిస్టెంట్ డైరెక్టర్ మాలతి సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి అధ్యక్షతన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ కార్యాలయంలో మండల సర్వేయర్లు, గ్రామ పాలనా కార్యదర్శులు (GPOలు), మండల తహశీల్దార్లకు భూ పునఃసర్వే (Land Resurvey) ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సర్వే ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీసర్వే జోనల్ అధికారి పి. శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాలతి మాట్లాడుతూ వెబ్ పోర్టల్‌లో మండల సర్వేయర్ లాగిన్ ద్వారా సర్వే నంబర్లను క్షేత్రస్థాయిలో సర్వే చేసే విధానం, సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, GPO లాగిన్ ద్వారా సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసే విధానాలపై వివరించారు. అలాగే వివిధ రకాల ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్ (LPM) జనరేషన్, వాటి తయారీ విధానం, పోర్టల్‌లో ప్రతి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు.

భూ పునఃసర్వేలో ప్రతి దశ కీలకమని, సర్వే వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడంతో పాటు సాంకేతిక విధానాలను సక్రమంగా అనుసరించాలని సూచించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏడి సర్వే శ్రీనివాస్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (eDM), జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM