Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా త్రిదండి చిన్న జీయర్ స్వామి తిరునక్షత్రం!

Kothagudem: కొత్తగూడెం విద్యానగర్ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చిన్న జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవం, యతీంద్ర సప్తతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహణ.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 9 Nov 2026 8:12 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా త్రిదండి చిన్న జీయర్ స్వామి తిరునక్షత్రం!

Kothagudem: కొత్తగూడెం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో యతీంద్ర సప్తతి మహోత్సవం, త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

నరక చతుర్దశి, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం 7 గంటలకు పరమహంస పరివ్రాజకులు, జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి తిరునక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధన, అర్చన, నివేదన, మంగళాశాసనం, తనియ విన్నపం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాద గోష్టి కార్యక్రమం జరిగింది.

ఈ వేడుకల్లో భగవత్ బంధువులైన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM