Kothagudem: రేపటి నుంచే టీజీ టెట్ పరీక్షలు.. కలెక్టర్ అంకిత్ కీలక ప్రకటన!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ 16 నుండి 22 వరకు జరిగే టీజీ టెట్ జూన్-2026 ఆన్‌లైన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.
Kothagudem: రేపటి నుంచే టీజీ టెట్ పరీక్షలు.. కలెక్టర్ అంకిత్ కీలక ప్రకటన!
కొత్తగూడెం: జిల్లాలో నిర్వహించనున్న టీజీ టెట్ జూన్–2026 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 16 నుండి జూన్ 22 వరకు మొత్తం ఐదు రోజుల పాటు పది సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం 1,217 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం పాల్వంచలోని అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేసి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్, ఇంటర్నెట్, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకుని హాల్ టికెట్‌తో పాటు సంబంధిత గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు పరీక్షా నిబంధనలను తప్పనిసరిగా పాటించి విజయవంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు.




