Kothagudem: కొత్తగూడెంలో కాంగ్రెస్ పాదయాత్ర: సీఈసీ రాజీనామాకు డిమాండ్

Kothagudem: ఓటు హక్కు పరిరక్షణకై కొత్తగూడెంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పాదయాత్ర నిర్వహించి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 8 Oct 2026 4:14 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో కాంగ్రెస్ పాదయాత్ర: సీఈసీ రాజీనామాకు డిమాండ్

కొత్తగూడెం: ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే డిమాండ్‌తో కొత్తగూడెంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్షాల పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహించారు. SIR పేరుతో ఓటు హక్కును తొలగించే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. SIR ప్రక్రియ పేరుతో ఓటు హక్కును హరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు.

అరెస్టులకు, బెదిరింపులకు కాంగ్రెస్ శ్రేణులు భయపడబోవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని తోట దేవి ప్రసన్న స్పష్టం చేశారు.

కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, కొత్వాల శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, ఏనుగుల అర్జునరావు, ఎర్రమల్లెల శ్రీనివాస్ రెడ్డి, గద్దల రమేష్ ,చింతలపూడి రాజశేఖర్, చింత నాగరాజు, నారాయణ చీకటి శ్రీను సత్యప్రసాద్ హనుమంతు, నర్రా అజయ్, పరమేష్ యాదవ్, పూనెం. శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM