Kothagudem: కేంద్ర ఎన్నికల అధికారి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ధర్నా!

Kothagudem: కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కొత్తగూడెంలో కాంగ్రెస్ భారీ ధర్నా, కలెక్టరేట్ ముట్టడి, దిష్టిబొమ్మ దగ్ధం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Sept 2026 7:51 PM IST
Kothagudem
X

Kothagudem: కేంద్ర ఎన్నికల అధికారి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ధర్నా!

Kothagudem: కోట్లాది మంది ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ డిమాండ్ చేశారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మంది కార్యకర్తలతో భారీ ధర్నా, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు, కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తూ దేశవ్యాప్తంగా SIR పేరుతో 20 శాతం ఓట్లను తొలగించి కోట్లాది మంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కేంద్ర ఎన్నికల అధికారిని తక్షణమే పదవి నుండి తొలగించి రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్