Kothagudem: జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై పోరాటం సాబీర్ పాషా

Kothagudem: ఓటు చోరీ నేరమని, ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా డిమాండ్. నవంబర్ 1న ఛలో ఢిల్లీ.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Oct 2026 7:53 PM IST
Kothagudem
X

Kothagudem: జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై పోరాటం సాబీర్ పాషా

కొత్తగూడెం: ఓటు చోరీ క్షమించరాని నేరమని, ప్రజాస్వామ్య విలువలను కాలరాసే హక్కు ఎవరికీ లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజీలేని పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ర్యాలీ, నిరసన కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 120 మందితో కూడిన సీపీఐ ప్రతినిధి బృందం తరలివెళ్తుందని తెలిపారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణ కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రజా తీర్పును గౌరవించడం ప్రతి వ్యవస్థ బాధ్యతని అన్నారు. ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని సూచించారు.

ఎన్నికల సంఘం పనితీరుపై న్యాయస్థానాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు రక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం కోసం తమ పోరాటం కొనసాగుతుందని సాబీర్ పాషా స్పష్టం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM